Sunday, May 22, 2011

పెరు సాహస యాత్ర :)


ఈ టపా మా ముగ్గురు స్నేహితురాళ్ళ పెరు యాత్ర ను మళ్ళీ గుర్తు చేసుకొంటూ మా అనుభూతులని ఇందులో పొందుపరుస్తున్నా.. జ్యోతి, నిరు, నేను ఒకటి రెండు ఏళ్ళ నుండి ఒక విదీశీ యాత్ర చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేస్తూ వున్నాము..ఇలాంటి సమయము లో జ్యో వాళ్ల సహాద్యోగి మచు-పిచు అనే వూరు వెళ్ళి వచ్చింది అని తెలిసింది. ఆ పేరు వినగానే నా మొదటి ఆలోచన.. ఇదేమి ఊరు పేరు కొబ్బరి పీచు లా ఉంది పేరు అనుకున్న :) పేరు పెద్ద గా అప్పీలింగ్ గా లేని మూలాన ట్రిప్ గురించి పెద్ద గ అలొచించలేదు కూడ :) ఈ లోపు పని వత్తిడి, ఇంట్లో వాళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎక్కడికైన సరే వెళదాము అని నిశ్చయానికి వచ్చి మళ్ళీ కెలికాను నా స్నేహితురాళ్ళని..జ్యొ ఎగిరి గంతేసి మొత్తం అన్ని వివరాలు సేకరించింది...నిజం చెప్పొద్దు..వికి లో ఫొటొలు చుసి, ఆ ప్రాంతం విశేషాలు చదివి చాల ఉత్సాహం గా అనిపించింది. లేడికి లెచిందే పరుగు అన్నట్టు మళ్ళీ ఆలస్యం చేస్తే ఎవరో ఒకళ్ళం బద్దకిస్తాం అని టిక్కెట్లు కొనేసాము... ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తే రక రకాల ఖరీదైన పాకేజి లు చెప్పారు..ఎందుకో మన అభిరుచి కి తగ్గట్టు నచ్చిన ప్రదేశాలో ఎక్కువ సేపు ఆగే స్వేచ్ఛ ఉండదు అనిపించి, అందరి లాగ కాకుండా వెరైటి గా చేద్దాము అని మాకు మేమే ఆ ప్రదేశాలను చూసి వద్దాము అని నిర్ణయించుకున్నాము....ఎన్నో ఈ-మెయిల్స్, ఫోన్ ల లొ డిస్కస్స్ చేసుకుంటూ ప్రయాణానికి కావాల్సిన సరంజామా సర్దుకున్నాము...ఇక్కడ మా డార్ల్ంగ్ జ్యో గురించి కాస్త చెప్పుకోవాలి..మన మాడమ్ గారు "ఫ్రెండ్స్" సీరియల్ లో ని మోనికా టైపు అన్నమాట....తక్కువ లగేజి వుంటే మంచిది అని చెప్పినా జ్యొ ఎమో హోటల్స్ లో టవల్, దుప్పటి సరిగా వుతికినవి పెట్టరు అది ఇది అంటూ ఒక రెండు పెద్ద బ్యాగులు తెచ్చింది..తర్వాత అవి మొయ్యలేక నానా ఇబ్బంది పడ్డాం అనుకోండి...అలాగే తన ముందు చూపు మమ్మల్ని కొని సార్లు రక్షించింది కూడా..ఒక్కో చోట చాల చలిగా ఉండి తను తెచ్చిన వింటర్ కోట్ అవి బాగా ఉపయోగ పడ్డాయి :) వాళ్ళ రూమ్ కి మొదటి సారి వెళ్ళిన రోజు నాకు ఇంకా గుర్తు...ఏ పని అయిన నీట్ గా ఉండాలి అని తన తాపత్రయం ఎంతో ముచ్చట గాను, ఒక్కొ సారి అబ్బా ఏమిటీ అతి శుభ్రం అని కూడా అనిపించేది లెండి... పెరు రాజధాని లిమా లో కలవడము తో మా యాత్ర మొదలు కాబోతుంది అన్న ఆలోచన తో సంతోషము గా మొత్తానికి ముగ్గురము విమానము ఎక్కేసాము...౧౦ గంటల ప్రయాణ సమయాన్ని వృధా కాకుండా గడపాలి అని ఒక ౫ గంటలు స్పానిశ్ టు ఇంగ్లిష్ పుస్తకాన్ని మహా ఉత్సాహంగా నమిలి పడేస్తున్నా...ఈ లోపు నా పక్కన ఒక రౌడి లాంటి వ్యక్తి వచ్చి కూర్చున్నాడు..పనమ సిటి లో..మెల్లగా మాటలు కలిపాడు..మాట్లాడాక పర్లేదు మంచివాడే అనిపించాడు...మనిషి వాలకాన్ని చూసి ఒక అభిప్రాయానికి రాగూడదు అని నిరూపించాడు మరోసారి...ఇలా ముగ్గురము అమ్మాయిలము పెరు యాత్ర కి బయలుదేరాం అని చెప్తే మొదట ఆశ్చర్యపోయాడు...నా స్వదేశాన్ని నేనే ఇంతవరకూ చూడలేదు...లీమా అంతటా డ్రగ్స్, మాఫియా గ్యాంగ్ లు ఉంటారు జాగ్రత్త అమ్మాయిలూ అని హెచ్చరించాడు..ఇంక చూసుకోండి నాకు గుండె దడ మొదలు..అసలే ఇంట్లో చెపితే వెళ్ళద్దు అంటారు అని అమ్మ, నాన్న కు చెప్పకుండా, తమ్ముడికి, చెల్లాయి కి పేరెంట్స్ తో చెప్పకుండా ఉండడానికి లంచం ఇస్తానని మొదలుపెట్టిన జర్నీ కాబట్టీ ఒక పక్క ఆ పశ్చాత్తాపం, ఇదేంటి యితను యిలా భయపెడుతున్నాడు అని తల్చుకొని ఒక్క సారి ఏడుపు వచ్చేసింది..ఇలాంటప్పుడే మనకి కోటి దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు...అలా దేవుళ్ళ కి క్షేమము గా మళ్ళా ఇంటికి చేర్చమని వేడుకుంటూ, భాష రాని దేశం లో గైడ్ వద్దు మనమే చూద్దాము అని నొక్కి వక్కాణించి చెప్పిన(క్షమించాలి..ఎప్పుడో చిన్నప్పుడు దుర్గాబాయి దేశ్ఁముఖ్ గారి గురించి చదివిన పాఠము లో ఈ పద ప్రయోగము బాగ నచ్చేసి ఇలా నా రాత లలో పెట్టేసుకుంటున్నా) నా మూర్ఖత్వానికి నా లో నేనే తిట్టుకుంటూ మొత్తానికి లీమా విమానాశ్రయం లో దిగాను.(ఆ తరువాత ఏమి జరిగింది, మేము ముగ్గురము ఎలా కలుసుకున్నాము, ఎక్కడెక్కడ కి వెళ్ళాము మిగతా కధ మళ్ళీ ఎప్పుడో రాసేస్తా..ఇప్పటికి ఇంతే సంగతులు చిత్తగించవలెను)...మీ..వినీల.

Saturday, February 5, 2011

తెలుగు నిఘంటువు తో నా అనుబంధం.

http://www.telugunighantuvu.com/

ఇంగ్లీషు లో లాగా తెలుగు పదాల అర్ధాలు తెలుసుకోవడానికి అంతర్జాలం లో ఒక డిక్షనరీ ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనుకొనేదాన్ని. సరిగ్గా అదే సమయం లో రామి గారి బ్లాగు లో తెలుగు పదాల నిఘంటువు గురించి కలిసి పని చేద్దాము అన్న టపా నన్ను ఆలోచింపచేసింది. అలా ఆ బృందం లో కలిసిన నాకు క్రొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఎవ్వరి సమయాన్ని బట్టి వారు తమ వంతు సాయం అందిస్తూ, శ్రమ తో ఈ మొదటి దశ పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తి తో మరికొందరు ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకొని ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయం అందిస్తారని ఆశిస్తూ..

హమ్మయ్యా..ఆంధ్రులు ఆరంభశూరులు అనే సామెత ని నిజం చేస్తూ ఈ బ్లాగు మొదలు పెట్టి మానేస్తానేమో అనే దిగులు పట్టుకున్న నాకు ఈ టపా మరిన్ని బ్లాగులు రాసేందుకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.