Wednesday, July 4, 2012

పెరు సాహస యాత్ర-2


Day 1!!

అబ్బ ఒక్క సంవత్సరం అయిపోయిందా మొదటి భాగం రాసి.

జ్యోతి,నిరూ,నేను ముగ్గురం ఐర్ పోర్ట్ లో కలుసుకొని హోటల్ వాళ్ళ క్యాబ్ లో రాత్రి రెండింటికి రూం కి వచ్చిపడ్డాము. మేము చదువు అయ్యాక మళ్ళీ కలవడం అదే మొదటి సారి..ఇంక రాత్రి అంతా ప్రపంచం లో వున్న విషయాలు అన్ని మాట్లాడుకొని, మధ్యాహ్నం ఎప్పుడో లీమా ఊరు చూడడానికి బయట పడ్డాము.

ఒక టూర్ బస్సులో కూర్చొని గైడు పిల్ల తో మాటలు కలిపాము. పిల్ల చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది అంట ముచ్చట వేసింది. మధ్య లో ఒక కూడలి లో ఆపింది పావు గంటలో తిరిగి రమ్మంది..మేము లోకం మరచిపోయి షాప్పింగ్ చేసుకొని బయటికి వచ్చి చూస్తే బస్సు మాయం. ఇక మా టెన్షన్ చూడాలి..నా ఫోన్ రోమింగ్ లో పెట్టి వాళ్ళ నంబెర్ కని పెట్టి మళ్ళీ బస్సు చేరుకున్నాము. ఇక ఆ పిల్ల ని ఎడా పెడా వాయించేసాము..అలా వదిలి రావడమేనా అని నేను, నిరు. జ్యో ఎంత మంచిది అంటే పాపం ఆ అమ్మాయి వున్న పరిస్థితి మీరు అర్ఢం చేసుకోండి అని మాకు సర్ది చెప్పింది.. నిజం గానే ఆమె తప్పు ఏమి లేదు. బుస్సు లొ వున్న మిగతా వారు ఒత్తిడి చేసారు అంట. అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని తర్వాత చెప్పింది. ఒకో సారి కోపం లో ఎదుటి వారి వాదన పట్టించుకోము కదా అనిపించింది. ఇక నుండి ఈ తప్పు చెయ్యకూడదు మళ్ళీ అని గట్టిగా అనేసుకొని ఆ రోజు కి విశ్రాంతి తీసుకొన్నాము.
Day 2!!

ఇక రెండవ రోజు కూజ్కో అనే వూరికి విమానం లో బయలు దేరాము. లిమ నుండి గంట లో చేరుకున్నాము. ఇక్కడ మళ్ళీ మా టాలెంట్ వాడి బాగ బేరం ఆడాము అని ఫీల్ అయ్యి ఒక టాక్సి ఎక్కాము.
మధ్యలో ఒక చోట ఉన్ని తో వడికి అమ్మే బట్టల దుకాణం కనబడింది. అన్ని దుకాణాలు తిరిగి చూస్తూ ఉన్నాము. నాకు కొండ పైన ఎక్కినప్పుడు ఊపిరి ఆడదు. ఆ విషయం మర్చిపోయి గెంతుతున్న. ఒక్క సారి గా పొట్ట లో ఒకటే నొప్పి. లాభం లేదు అని అందరం గబ గబా హొటెల్ కెళ్ళాము. అక్కడ వచ్చే వారికి ఇది సాధారణం అని చెప్పి "కోకో" ఆకుల టీ ఇచ్చరు మాకు. 10 నిమిషాల లో ఎవరో తీసేసినట్టే నొప్పి పోయింది. హమ్మయ్య అనుకొని ఆ ఊరు చూడ్డానికి వెళ్ళాము ఆ రోజు. వారి వ్యవసాయ మడులు అవి ఎంతో అలొచన తో మలచినట్టు అనిపించాయి మాకు.

Day 3!!

పెరు లో సీ ఫుడ్ చాలా బాగుంటుంది. అమెరికా కన్న అక్కడి కూరగాయ ల లో కూడా ఎంతొ రుచి అనిపించింది. అసలు విషయం ఏంటంటే మనం వంట చెయ్యకండా తయారు గా భోజనం చేస్తున్నాము కదా అందుకే అన్ని అంత టేస్టీ గా అనిపించాయి ఏమో :)) అలా మరసటి రోజు అల్పాహారం బాగ తిని "మాచు పీచు" కొండలు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడానికి బయలు దేరాము. ఈ ట్రైన్ ఏంటంటే ముందు గా టిక్కెట్లు తీసుకోవాలి లెదంటే అక్కడ కి వెళ్ళి దొరక్క ఇబ్బంది అని వెబ్ లో చదివాము మేము. అలా ముందే కొని పేపెర్ లు తెచ్చుకొన్నాము. నేను అన్ని రోజుల ప్రణాళికలు చూస్తూ మేము ఆ రోజు ఎక్క వలసిన ట్రైన్ ఒక గంట తర్వాత అనుకొన్నాను. టాక్సీ లో ఎక్కాక అసల విషయం తెలిసి త్వరగా వెళ్దామని ప్రయత్నించాము. ఎన్ని అలొచనలో ఆ కొద్ది సమయము లో. అబ్బ ఇంత ప్రయాస వ్రుధా యేనా అనుకున్నా. నా కంగారు తో అంతా కలగా పులగం అయిపోయింది అనుకొన్నా. రైల్వే స్టేషన్ లో ఎందుకు ఈ రైళ్ళు మనకి కావల్సినప్పుడే ఆలస్యం చేస్తాయి. వద్దన్నప్పుడేమో టైము కి వస్తాయి హహా. ఇక వెళ్ళి కనుక్కుంటే మళ్ళీ ఇంకో గంట లో మరో రైలు వుంది అన్నారు. చేసేది లేక మళ్ళీ టిక్కెట్టు కొనుక్కొని ఎక్కాము రైలు.
అబ్బ ఆ కొండలూ గుట్టలూ ఎంత బాగున్నాయో..నాకు ఇలా వెళ్ళినప్పుడు వెరైటి గా నా మూలాలు ఈ కొండలలో వున్నది అని అనిపిస్తూ వుంటుంది. ఎన్ని గంటలైనా అలా చూస్తూ కూర్చుండి పోవచ్చు. ఆ అనుభూతి వర్ణనాతీతము. మొత్తానికి రైలు దిగి మరో ఆఖరి వాహన ప్రయాణం బస్సు ఎక్కాము. బస్సు దిగి చుసామా కొండలు చుట్టూ కొండలే. అది ఇంకొక విచిత్ర మైన అనుభూతి. మిగతా వివరాలు మరొక్క పొస్ట్ లో.