Wednesday, July 4, 2012

పెరు సాహస యాత్ర-2


Day 1!!

అబ్బ ఒక్క సంవత్సరం అయిపోయిందా మొదటి భాగం రాసి.

జ్యోతి,నిరూ,నేను ముగ్గురం ఐర్ పోర్ట్ లో కలుసుకొని హోటల్ వాళ్ళ క్యాబ్ లో రాత్రి రెండింటికి రూం కి వచ్చిపడ్డాము. మేము చదువు అయ్యాక మళ్ళీ కలవడం అదే మొదటి సారి..ఇంక రాత్రి అంతా ప్రపంచం లో వున్న విషయాలు అన్ని మాట్లాడుకొని, మధ్యాహ్నం ఎప్పుడో లీమా ఊరు చూడడానికి బయట పడ్డాము.

ఒక టూర్ బస్సులో కూర్చొని గైడు పిల్ల తో మాటలు కలిపాము. పిల్ల చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది అంట ముచ్చట వేసింది. మధ్య లో ఒక కూడలి లో ఆపింది పావు గంటలో తిరిగి రమ్మంది..మేము లోకం మరచిపోయి షాప్పింగ్ చేసుకొని బయటికి వచ్చి చూస్తే బస్సు మాయం. ఇక మా టెన్షన్ చూడాలి..నా ఫోన్ రోమింగ్ లో పెట్టి వాళ్ళ నంబెర్ కని పెట్టి మళ్ళీ బస్సు చేరుకున్నాము. ఇక ఆ పిల్ల ని ఎడా పెడా వాయించేసాము..అలా వదిలి రావడమేనా అని నేను, నిరు. జ్యో ఎంత మంచిది అంటే పాపం ఆ అమ్మాయి వున్న పరిస్థితి మీరు అర్ఢం చేసుకోండి అని మాకు సర్ది చెప్పింది.. నిజం గానే ఆమె తప్పు ఏమి లేదు. బుస్సు లొ వున్న మిగతా వారు ఒత్తిడి చేసారు అంట. అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని తర్వాత చెప్పింది. ఒకో సారి కోపం లో ఎదుటి వారి వాదన పట్టించుకోము కదా అనిపించింది. ఇక నుండి ఈ తప్పు చెయ్యకూడదు మళ్ళీ అని గట్టిగా అనేసుకొని ఆ రోజు కి విశ్రాంతి తీసుకొన్నాము.
Day 2!!

ఇక రెండవ రోజు కూజ్కో అనే వూరికి విమానం లో బయలు దేరాము. లిమ నుండి గంట లో చేరుకున్నాము. ఇక్కడ మళ్ళీ మా టాలెంట్ వాడి బాగ బేరం ఆడాము అని ఫీల్ అయ్యి ఒక టాక్సి ఎక్కాము.
మధ్యలో ఒక చోట ఉన్ని తో వడికి అమ్మే బట్టల దుకాణం కనబడింది. అన్ని దుకాణాలు తిరిగి చూస్తూ ఉన్నాము. నాకు కొండ పైన ఎక్కినప్పుడు ఊపిరి ఆడదు. ఆ విషయం మర్చిపోయి గెంతుతున్న. ఒక్క సారి గా పొట్ట లో ఒకటే నొప్పి. లాభం లేదు అని అందరం గబ గబా హొటెల్ కెళ్ళాము. అక్కడ వచ్చే వారికి ఇది సాధారణం అని చెప్పి "కోకో" ఆకుల టీ ఇచ్చరు మాకు. 10 నిమిషాల లో ఎవరో తీసేసినట్టే నొప్పి పోయింది. హమ్మయ్య అనుకొని ఆ ఊరు చూడ్డానికి వెళ్ళాము ఆ రోజు. వారి వ్యవసాయ మడులు అవి ఎంతో అలొచన తో మలచినట్టు అనిపించాయి మాకు.

Day 3!!

పెరు లో సీ ఫుడ్ చాలా బాగుంటుంది. అమెరికా కన్న అక్కడి కూరగాయ ల లో కూడా ఎంతొ రుచి అనిపించింది. అసలు విషయం ఏంటంటే మనం వంట చెయ్యకండా తయారు గా భోజనం చేస్తున్నాము కదా అందుకే అన్ని అంత టేస్టీ గా అనిపించాయి ఏమో :)) అలా మరసటి రోజు అల్పాహారం బాగ తిని "మాచు పీచు" కొండలు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడానికి బయలు దేరాము. ఈ ట్రైన్ ఏంటంటే ముందు గా టిక్కెట్లు తీసుకోవాలి లెదంటే అక్కడ కి వెళ్ళి దొరక్క ఇబ్బంది అని వెబ్ లో చదివాము మేము. అలా ముందే కొని పేపెర్ లు తెచ్చుకొన్నాము. నేను అన్ని రోజుల ప్రణాళికలు చూస్తూ మేము ఆ రోజు ఎక్క వలసిన ట్రైన్ ఒక గంట తర్వాత అనుకొన్నాను. టాక్సీ లో ఎక్కాక అసల విషయం తెలిసి త్వరగా వెళ్దామని ప్రయత్నించాము. ఎన్ని అలొచనలో ఆ కొద్ది సమయము లో. అబ్బ ఇంత ప్రయాస వ్రుధా యేనా అనుకున్నా. నా కంగారు తో అంతా కలగా పులగం అయిపోయింది అనుకొన్నా. రైల్వే స్టేషన్ లో ఎందుకు ఈ రైళ్ళు మనకి కావల్సినప్పుడే ఆలస్యం చేస్తాయి. వద్దన్నప్పుడేమో టైము కి వస్తాయి హహా. ఇక వెళ్ళి కనుక్కుంటే మళ్ళీ ఇంకో గంట లో మరో రైలు వుంది అన్నారు. చేసేది లేక మళ్ళీ టిక్కెట్టు కొనుక్కొని ఎక్కాము రైలు.
అబ్బ ఆ కొండలూ గుట్టలూ ఎంత బాగున్నాయో..నాకు ఇలా వెళ్ళినప్పుడు వెరైటి గా నా మూలాలు ఈ కొండలలో వున్నది అని అనిపిస్తూ వుంటుంది. ఎన్ని గంటలైనా అలా చూస్తూ కూర్చుండి పోవచ్చు. ఆ అనుభూతి వర్ణనాతీతము. మొత్తానికి రైలు దిగి మరో ఆఖరి వాహన ప్రయాణం బస్సు ఎక్కాము. బస్సు దిగి చుసామా కొండలు చుట్టూ కొండలే. అది ఇంకొక విచిత్ర మైన అనుభూతి. మిగతా వివరాలు మరొక్క పొస్ట్ లో.

Sunday, May 22, 2011

పెరు సాహస యాత్ర :)


ఈ టపా మా ముగ్గురు స్నేహితురాళ్ళ పెరు యాత్ర ను మళ్ళీ గుర్తు చేసుకొంటూ మా అనుభూతులని ఇందులో పొందుపరుస్తున్నా.. జ్యోతి, నిరు, నేను ఒకటి రెండు ఏళ్ళ నుండి ఒక విదీశీ యాత్ర చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేస్తూ వున్నాము..ఇలాంటి సమయము లో జ్యో వాళ్ల సహాద్యోగి మచు-పిచు అనే వూరు వెళ్ళి వచ్చింది అని తెలిసింది. ఆ పేరు వినగానే నా మొదటి ఆలోచన.. ఇదేమి ఊరు పేరు కొబ్బరి పీచు లా ఉంది పేరు అనుకున్న :) పేరు పెద్ద గా అప్పీలింగ్ గా లేని మూలాన ట్రిప్ గురించి పెద్ద గ అలొచించలేదు కూడ :) ఈ లోపు పని వత్తిడి, ఇంట్లో వాళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎక్కడికైన సరే వెళదాము అని నిశ్చయానికి వచ్చి మళ్ళీ కెలికాను నా స్నేహితురాళ్ళని..జ్యొ ఎగిరి గంతేసి మొత్తం అన్ని వివరాలు సేకరించింది...నిజం చెప్పొద్దు..వికి లో ఫొటొలు చుసి, ఆ ప్రాంతం విశేషాలు చదివి చాల ఉత్సాహం గా అనిపించింది. లేడికి లెచిందే పరుగు అన్నట్టు మళ్ళీ ఆలస్యం చేస్తే ఎవరో ఒకళ్ళం బద్దకిస్తాం అని టిక్కెట్లు కొనేసాము... ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తే రక రకాల ఖరీదైన పాకేజి లు చెప్పారు..ఎందుకో మన అభిరుచి కి తగ్గట్టు నచ్చిన ప్రదేశాలో ఎక్కువ సేపు ఆగే స్వేచ్ఛ ఉండదు అనిపించి, అందరి లాగ కాకుండా వెరైటి గా చేద్దాము అని మాకు మేమే ఆ ప్రదేశాలను చూసి వద్దాము అని నిర్ణయించుకున్నాము....ఎన్నో ఈ-మెయిల్స్, ఫోన్ ల లొ డిస్కస్స్ చేసుకుంటూ ప్రయాణానికి కావాల్సిన సరంజామా సర్దుకున్నాము...ఇక్కడ మా డార్ల్ంగ్ జ్యో గురించి కాస్త చెప్పుకోవాలి..మన మాడమ్ గారు "ఫ్రెండ్స్" సీరియల్ లో ని మోనికా టైపు అన్నమాట....తక్కువ లగేజి వుంటే మంచిది అని చెప్పినా జ్యొ ఎమో హోటల్స్ లో టవల్, దుప్పటి సరిగా వుతికినవి పెట్టరు అది ఇది అంటూ ఒక రెండు పెద్ద బ్యాగులు తెచ్చింది..తర్వాత అవి మొయ్యలేక నానా ఇబ్బంది పడ్డాం అనుకోండి...అలాగే తన ముందు చూపు మమ్మల్ని కొని సార్లు రక్షించింది కూడా..ఒక్కో చోట చాల చలిగా ఉండి తను తెచ్చిన వింటర్ కోట్ అవి బాగా ఉపయోగ పడ్డాయి :) వాళ్ళ రూమ్ కి మొదటి సారి వెళ్ళిన రోజు నాకు ఇంకా గుర్తు...ఏ పని అయిన నీట్ గా ఉండాలి అని తన తాపత్రయం ఎంతో ముచ్చట గాను, ఒక్కొ సారి అబ్బా ఏమిటీ అతి శుభ్రం అని కూడా అనిపించేది లెండి... పెరు రాజధాని లిమా లో కలవడము తో మా యాత్ర మొదలు కాబోతుంది అన్న ఆలోచన తో సంతోషము గా మొత్తానికి ముగ్గురము విమానము ఎక్కేసాము...౧౦ గంటల ప్రయాణ సమయాన్ని వృధా కాకుండా గడపాలి అని ఒక ౫ గంటలు స్పానిశ్ టు ఇంగ్లిష్ పుస్తకాన్ని మహా ఉత్సాహంగా నమిలి పడేస్తున్నా...ఈ లోపు నా పక్కన ఒక రౌడి లాంటి వ్యక్తి వచ్చి కూర్చున్నాడు..పనమ సిటి లో..మెల్లగా మాటలు కలిపాడు..మాట్లాడాక పర్లేదు మంచివాడే అనిపించాడు...మనిషి వాలకాన్ని చూసి ఒక అభిప్రాయానికి రాగూడదు అని నిరూపించాడు మరోసారి...ఇలా ముగ్గురము అమ్మాయిలము పెరు యాత్ర కి బయలుదేరాం అని చెప్తే మొదట ఆశ్చర్యపోయాడు...నా స్వదేశాన్ని నేనే ఇంతవరకూ చూడలేదు...లీమా అంతటా డ్రగ్స్, మాఫియా గ్యాంగ్ లు ఉంటారు జాగ్రత్త అమ్మాయిలూ అని హెచ్చరించాడు..ఇంక చూసుకోండి నాకు గుండె దడ మొదలు..అసలే ఇంట్లో చెపితే వెళ్ళద్దు అంటారు అని అమ్మ, నాన్న కు చెప్పకుండా, తమ్ముడికి, చెల్లాయి కి పేరెంట్స్ తో చెప్పకుండా ఉండడానికి లంచం ఇస్తానని మొదలుపెట్టిన జర్నీ కాబట్టీ ఒక పక్క ఆ పశ్చాత్తాపం, ఇదేంటి యితను యిలా భయపెడుతున్నాడు అని తల్చుకొని ఒక్క సారి ఏడుపు వచ్చేసింది..ఇలాంటప్పుడే మనకి కోటి దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు...అలా దేవుళ్ళ కి క్షేమము గా మళ్ళా ఇంటికి చేర్చమని వేడుకుంటూ, భాష రాని దేశం లో గైడ్ వద్దు మనమే చూద్దాము అని నొక్కి వక్కాణించి చెప్పిన(క్షమించాలి..ఎప్పుడో చిన్నప్పుడు దుర్గాబాయి దేశ్ఁముఖ్ గారి గురించి చదివిన పాఠము లో ఈ పద ప్రయోగము బాగ నచ్చేసి ఇలా నా రాత లలో పెట్టేసుకుంటున్నా) నా మూర్ఖత్వానికి నా లో నేనే తిట్టుకుంటూ మొత్తానికి లీమా విమానాశ్రయం లో దిగాను.(ఆ తరువాత ఏమి జరిగింది, మేము ముగ్గురము ఎలా కలుసుకున్నాము, ఎక్కడెక్కడ కి వెళ్ళాము మిగతా కధ మళ్ళీ ఎప్పుడో రాసేస్తా..ఇప్పటికి ఇంతే సంగతులు చిత్తగించవలెను)...మీ..వినీల.

Saturday, February 5, 2011

తెలుగు నిఘంటువు తో నా అనుబంధం.

http://www.telugunighantuvu.com/

ఇంగ్లీషు లో లాగా తెలుగు పదాల అర్ధాలు తెలుసుకోవడానికి అంతర్జాలం లో ఒక డిక్షనరీ ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనుకొనేదాన్ని. సరిగ్గా అదే సమయం లో రామి గారి బ్లాగు లో తెలుగు పదాల నిఘంటువు గురించి కలిసి పని చేద్దాము అన్న టపా నన్ను ఆలోచింపచేసింది. అలా ఆ బృందం లో కలిసిన నాకు క్రొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఎవ్వరి సమయాన్ని బట్టి వారు తమ వంతు సాయం అందిస్తూ, శ్రమ తో ఈ మొదటి దశ పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తి తో మరికొందరు ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకొని ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయం అందిస్తారని ఆశిస్తూ..

హమ్మయ్యా..ఆంధ్రులు ఆరంభశూరులు అనే సామెత ని నిజం చేస్తూ ఈ బ్లాగు మొదలు పెట్టి మానేస్తానేమో అనే దిగులు పట్టుకున్న నాకు ఈ టపా మరిన్ని బ్లాగులు రాసేందుకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Sunday, October 31, 2010

దొరలా కనిపించే దొంగ ఏంటీ వైరస్ సాఫ్ట్వేర్లు..

నా స్నేహితురాలు వారం క్రితం ఎదో వెబ్ఁసైట్ చూస్తుంటే ఏంటీ వైరస్ సాఫ్ట్వేర్ ముందస్తు హెచ్చరిక యిచ్చినా తను ఆ వెబ్సైట్ నుండి పాటలను దిగుమతి చేసింది. తన మెషీన్ ఇన్ఁఫెక్ట్ అయ్యి సమాచారం మొత్తం పోయింది అని చెప్పింది. ఎదో హిడ్డెన్(పేరు కనిపించని) ప్రాసెస్ నడుస్తూ కంప్యూటర్ నెమ్మదిగా నడిచింది. ఏ వెబ్సైట్ ఒపెన్ చేసినా తనకు ఈ ఫేక్ ఏవీ (దొంగ ఆంటీ వైరస్ ) 40-50 $$ పెట్టి కొనమని పాప్ అప్ నోటీసులు ఇచ్చి ఎంతో ఇబ్బంది కలిగించింది. అల కొంటేనే ఆ పేజ్ కనపడుతుంది అని భ్రమ కలిగించింది..సరే దీని పని పడదాం అని ఎమ్.స్(మైక్రోసాఫ్ట్) టాస్క్ఁమానేజర్ లో ఏ ఏ ప్రాసెస్ లు నడుస్తున్నయో చూద్దాం అంటే ఈ దొంగ ది కనిపించదాయె..స్టార్ట్ అప్ మెనూ లోను లేదు..ఇలాంటప్పుడు మనకు వెంటనే తట్టే మొదటి ఆలోచన..కంప్యూటర్ ని ఫార్మాట్ చేద్దాం అని. కానీ,..మనలో ఎవరికైనా మన ఇష్టమైన ఫోటోలు, ఎంతో కాలంగా ప్రోగు చేసిన డాటా అవి పోతే ఎంతో బాథ పడతాం. సో, జనరల్ గా ఏదైనా సస్ఁపీషియస్(అంటే అనుమానించ దగ్గ) ప్రాసెస్ లు కనపడాలి అంటే MS Process Explorer టూల్ ని వాడి చూడండి. అప్పుడు ఆ దాక్కున్నవి బయటపడతాయి. ఇందులో మీకు అనుమానంగా కనపడ్డ ప్రొసెస్ అంతగా పేరు లేని కంవెనీ ది మీ లోకల్ యూజర్ అడ్మిన్ గా నడుస్తూంటే కిల్ల్ చేయండి. అవి ఏ ఫోల్డర్ లో వున్నాయో చూసి ఆ executable file ని కూడా డిలీట్ చెయ్యండి. ఒక్కొసారి ఇదంతా చేసినా మళ్ళీ ఆ మాయదారి వైరస్ మళ్ళీ వచ్చిపడుతుంది..ఇలాంటప్పుడు విండోస్ రెజిస్ట్రీ ఎడిటర్ లొ కి వెళ్ళి ఈ క్రింది కీ ని డిలీట్ చేయండి. 
HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\Windows\CurrentVersion\Run\'suspicious process name'='hidden file name path'
ఇదంతా కేవలం ఒక చిన్న మిస్ లీడింగ్ అప్లికేషన్ ని తీయడానికి వుపయోగపడే సూచనలు..ఎప్పుడూ కూడా సేఫ్ వెబ్ బ్రౌజింగ్ అలవాటు చేసుకొని మన ఏంటీ వైరస్ డెఫినిషన్స్(వైరస్ ని గుర్తించే ఫైల్స్) ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకొని మన కంప్యూటర్ ని స్కాన్ చేసుకుంటూ ఉంటే చిన్ని చిన్ని తలనొప్పుల నుండి తప్పించుకోవచ్చు..