Saturday, February 5, 2011

తెలుగు నిఘంటువు తో నా అనుబంధం.

http://www.telugunighantuvu.com/

ఇంగ్లీషు లో లాగా తెలుగు పదాల అర్ధాలు తెలుసుకోవడానికి అంతర్జాలం లో ఒక డిక్షనరీ ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనుకొనేదాన్ని. సరిగ్గా అదే సమయం లో రామి గారి బ్లాగు లో తెలుగు పదాల నిఘంటువు గురించి కలిసి పని చేద్దాము అన్న టపా నన్ను ఆలోచింపచేసింది. అలా ఆ బృందం లో కలిసిన నాకు క్రొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఎవ్వరి సమయాన్ని బట్టి వారు తమ వంతు సాయం అందిస్తూ, శ్రమ తో ఈ మొదటి దశ పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తి తో మరికొందరు ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకొని ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయం అందిస్తారని ఆశిస్తూ..

హమ్మయ్యా..ఆంధ్రులు ఆరంభశూరులు అనే సామెత ని నిజం చేస్తూ ఈ బ్లాగు మొదలు పెట్టి మానేస్తానేమో అనే దిగులు పట్టుకున్న నాకు ఈ టపా మరిన్ని బ్లాగులు రాసేందుకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

Your effort is greatly appreciated Vineela. we, for sure, will take it to next level on par with any other language.

రవిశేఖర్ హృ(మ)ది లో said...

చాలా రోజులనుండి అంతర్జాలం లోనే తెలుగు నిఘంటువు వుంటే బాగుండు అనుకునేవాణ్ణి మీ ద్వారా తెలిసింది.మీ ప్రయత్నం చాలా గొప్పది.గమనించాను.చాలా ఉపయోగకరం .మీరు తరచుగా వ్రాయండి.ఏదో ఒకటి వ్రాస్తువుంటే అలవాటైపోతుంది.ఇంగ్లీష్ బ్లాగు ను కూడా ఆపి వేశారు.కొనసాగించండి.కాలిఫోర్నియా విశేషాలు వ్రాయండి.

Vineela said...

రవి శేఖర్ గారు..ధన్యవాదాలు మీ వ్యాఖ్య కి..మీ పొస్ట్ లు చాల స్ఫూర్తిదాయకం గా ఉంటాయి.
తప్పకుండా మళ్ళీ రాయడం మొదలు పెడతాను. నాకు ఎంతో ఇష్టమైన పని కూడా రాయడం

నిఘంటువు చాలా ఉపయోగం గా వున్నది నిజమే. ఈ మధ్య నేను ఏమి నిఘంటువు పనుల లో పాలుపంచుకోవడం లేదండి.
రామి రెడ్డి గారు నన్ను కొడతారు ఈ సారి కదిలించి పని చెయ్యకపొతే :))

Post a Comment