Sunday, October 31, 2010

దొరలా కనిపించే దొంగ ఏంటీ వైరస్ సాఫ్ట్వేర్లు..

నా స్నేహితురాలు వారం క్రితం ఎదో వెబ్ఁసైట్ చూస్తుంటే ఏంటీ వైరస్ సాఫ్ట్వేర్ ముందస్తు హెచ్చరిక యిచ్చినా తను ఆ వెబ్సైట్ నుండి పాటలను దిగుమతి చేసింది. తన మెషీన్ ఇన్ఁఫెక్ట్ అయ్యి సమాచారం మొత్తం పోయింది అని చెప్పింది. ఎదో హిడ్డెన్(పేరు కనిపించని) ప్రాసెస్ నడుస్తూ కంప్యూటర్ నెమ్మదిగా నడిచింది. ఏ వెబ్సైట్ ఒపెన్ చేసినా తనకు ఈ ఫేక్ ఏవీ (దొంగ ఆంటీ వైరస్ ) 40-50 $$ పెట్టి కొనమని పాప్ అప్ నోటీసులు ఇచ్చి ఎంతో ఇబ్బంది కలిగించింది. అల కొంటేనే ఆ పేజ్ కనపడుతుంది అని భ్రమ కలిగించింది..సరే దీని పని పడదాం అని ఎమ్.స్(మైక్రోసాఫ్ట్) టాస్క్ఁమానేజర్ లో ఏ ఏ ప్రాసెస్ లు నడుస్తున్నయో చూద్దాం అంటే ఈ దొంగ ది కనిపించదాయె..స్టార్ట్ అప్ మెనూ లోను లేదు..ఇలాంటప్పుడు మనకు వెంటనే తట్టే మొదటి ఆలోచన..కంప్యూటర్ ని ఫార్మాట్ చేద్దాం అని. కానీ,..మనలో ఎవరికైనా మన ఇష్టమైన ఫోటోలు, ఎంతో కాలంగా ప్రోగు చేసిన డాటా అవి పోతే ఎంతో బాథ పడతాం. సో, జనరల్ గా ఏదైనా సస్ఁపీషియస్(అంటే అనుమానించ దగ్గ) ప్రాసెస్ లు కనపడాలి అంటే MS Process Explorer టూల్ ని వాడి చూడండి. అప్పుడు ఆ దాక్కున్నవి బయటపడతాయి. ఇందులో మీకు అనుమానంగా కనపడ్డ ప్రొసెస్ అంతగా పేరు లేని కంవెనీ ది మీ లోకల్ యూజర్ అడ్మిన్ గా నడుస్తూంటే కిల్ల్ చేయండి. అవి ఏ ఫోల్డర్ లో వున్నాయో చూసి ఆ executable file ని కూడా డిలీట్ చెయ్యండి. ఒక్కొసారి ఇదంతా చేసినా మళ్ళీ ఆ మాయదారి వైరస్ మళ్ళీ వచ్చిపడుతుంది..ఇలాంటప్పుడు విండోస్ రెజిస్ట్రీ ఎడిటర్ లొ కి వెళ్ళి ఈ క్రింది కీ ని డిలీట్ చేయండి. 
HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\Windows\CurrentVersion\Run\'suspicious process name'='hidden file name path'
ఇదంతా కేవలం ఒక చిన్న మిస్ లీడింగ్ అప్లికేషన్ ని తీయడానికి వుపయోగపడే సూచనలు..ఎప్పుడూ కూడా సేఫ్ వెబ్ బ్రౌజింగ్ అలవాటు చేసుకొని మన ఏంటీ వైరస్ డెఫినిషన్స్(వైరస్ ని గుర్తించే ఫైల్స్) ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకొని మన కంప్యూటర్ ని స్కాన్ చేసుకుంటూ ఉంటే చిన్ని చిన్ని తలనొప్పుల నుండి తప్పించుకోవచ్చు..

6 comments:

భాస్కర రామిరెడ్డి said...

వినీల ముందుగా బ్లాగ్ లోకానికి స్వాగతం.

ఇలాంటి పోస్టులు ఎవరైనా వ్రాస్తారా అని చాలారోజులనుండి ఎదురుచూస్తూవున్నా. ఇప్పటికి మీరు ఇలా ముందుకు రావడం ఆనందంగా వుంది. ఇలా మొదలైన ఈ సీరీస్ ముందు ముందు మరిన్ని ఆలోచనాత్మ్లక టపాలతో తెలుగు బ్లాగులోకంలో ఒక సాంకేతిక ఒరవడిని సృష్టించాలని మనసారాకోరుకుంటున్నాను.

>> ఆ మాయదారి వైరస్ మళ్ళీ వచ్చిపడుతుంది..

అవును నిజంగా మాయలు మరాఠీలే వైరస్ లు వ్రాస్తుంటారు మరి :))

మంచు said...

ఆంటీ వైరస్ - కొద్ది ఫన్నీగా ఉంది :-) యాంటి వైరస్ అని రాయవచ్చేమో :-)

భాస్కర రామిరెడ్డి said...

@Manchu, అది ఆంటీ వైరసే... యాంటీ వైరస్ కాదు ;)

మంచు said...

ఎలా.... Text To Speech కన్వర్టర్ కూడా యాంటై అంటుంది

Vineela said...

మంచు..ఏంటీ వైరస్..ఫర్వాలేదంటారా :))

లాభం లేదు రామి రెడ్డి గారూ..తెలుగు నిఘంటువు తో పాటు ఇంగ్లిష్ టూ తెలుగు డిక్షనరీ పెట్టెయ్యాలి అర్జెంట్ గా..నా లాంటి వాళ్ళు ఇలా పదాలు వెతుక్కోకుండా..

ఆల్సో..మీ ముందు కామెంట్ కి..అలా మాయలు చేసేవాళ్ళు, ఇంకా మైక్రోసాఫ్ట్ వల్లే మా లాంటి వాల్లకి ఇంకా జాబ్ లున్నాయండి :))

Jyothi Sankuri said...

good one

Post a Comment