Sunday, May 22, 2011

పెరు సాహస యాత్ర :)


ఈ టపా మా ముగ్గురు స్నేహితురాళ్ళ పెరు యాత్ర ను మళ్ళీ గుర్తు చేసుకొంటూ మా అనుభూతులని ఇందులో పొందుపరుస్తున్నా.. జ్యోతి, నిరు, నేను ఒకటి రెండు ఏళ్ళ నుండి ఒక విదీశీ యాత్ర చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేస్తూ వున్నాము..ఇలాంటి సమయము లో జ్యో వాళ్ల సహాద్యోగి మచు-పిచు అనే వూరు వెళ్ళి వచ్చింది అని తెలిసింది. ఆ పేరు వినగానే నా మొదటి ఆలోచన.. ఇదేమి ఊరు పేరు కొబ్బరి పీచు లా ఉంది పేరు అనుకున్న :) పేరు పెద్ద గా అప్పీలింగ్ గా లేని మూలాన ట్రిప్ గురించి పెద్ద గ అలొచించలేదు కూడ :) ఈ లోపు పని వత్తిడి, ఇంట్లో వాళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎక్కడికైన సరే వెళదాము అని నిశ్చయానికి వచ్చి మళ్ళీ కెలికాను నా స్నేహితురాళ్ళని..జ్యొ ఎగిరి గంతేసి మొత్తం అన్ని వివరాలు సేకరించింది...నిజం చెప్పొద్దు..వికి లో ఫొటొలు చుసి, ఆ ప్రాంతం విశేషాలు చదివి చాల ఉత్సాహం గా అనిపించింది. లేడికి లెచిందే పరుగు అన్నట్టు మళ్ళీ ఆలస్యం చేస్తే ఎవరో ఒకళ్ళం బద్దకిస్తాం అని టిక్కెట్లు కొనేసాము... ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తే రక రకాల ఖరీదైన పాకేజి లు చెప్పారు..ఎందుకో మన అభిరుచి కి తగ్గట్టు నచ్చిన ప్రదేశాలో ఎక్కువ సేపు ఆగే స్వేచ్ఛ ఉండదు అనిపించి, అందరి లాగ కాకుండా వెరైటి గా చేద్దాము అని మాకు మేమే ఆ ప్రదేశాలను చూసి వద్దాము అని నిర్ణయించుకున్నాము....ఎన్నో ఈ-మెయిల్స్, ఫోన్ ల లొ డిస్కస్స్ చేసుకుంటూ ప్రయాణానికి కావాల్సిన సరంజామా సర్దుకున్నాము...ఇక్కడ మా డార్ల్ంగ్ జ్యో గురించి కాస్త చెప్పుకోవాలి..మన మాడమ్ గారు "ఫ్రెండ్స్" సీరియల్ లో ని మోనికా టైపు అన్నమాట....తక్కువ లగేజి వుంటే మంచిది అని చెప్పినా జ్యొ ఎమో హోటల్స్ లో టవల్, దుప్పటి సరిగా వుతికినవి పెట్టరు అది ఇది అంటూ ఒక రెండు పెద్ద బ్యాగులు తెచ్చింది..తర్వాత అవి మొయ్యలేక నానా ఇబ్బంది పడ్డాం అనుకోండి...అలాగే తన ముందు చూపు మమ్మల్ని కొని సార్లు రక్షించింది కూడా..ఒక్కో చోట చాల చలిగా ఉండి తను తెచ్చిన వింటర్ కోట్ అవి బాగా ఉపయోగ పడ్డాయి :) వాళ్ళ రూమ్ కి మొదటి సారి వెళ్ళిన రోజు నాకు ఇంకా గుర్తు...ఏ పని అయిన నీట్ గా ఉండాలి అని తన తాపత్రయం ఎంతో ముచ్చట గాను, ఒక్కొ సారి అబ్బా ఏమిటీ అతి శుభ్రం అని కూడా అనిపించేది లెండి... పెరు రాజధాని లిమా లో కలవడము తో మా యాత్ర మొదలు కాబోతుంది అన్న ఆలోచన తో సంతోషము గా మొత్తానికి ముగ్గురము విమానము ఎక్కేసాము...౧౦ గంటల ప్రయాణ సమయాన్ని వృధా కాకుండా గడపాలి అని ఒక ౫ గంటలు స్పానిశ్ టు ఇంగ్లిష్ పుస్తకాన్ని మహా ఉత్సాహంగా నమిలి పడేస్తున్నా...ఈ లోపు నా పక్కన ఒక రౌడి లాంటి వ్యక్తి వచ్చి కూర్చున్నాడు..పనమ సిటి లో..మెల్లగా మాటలు కలిపాడు..మాట్లాడాక పర్లేదు మంచివాడే అనిపించాడు...మనిషి వాలకాన్ని చూసి ఒక అభిప్రాయానికి రాగూడదు అని నిరూపించాడు మరోసారి...ఇలా ముగ్గురము అమ్మాయిలము పెరు యాత్ర కి బయలుదేరాం అని చెప్తే మొదట ఆశ్చర్యపోయాడు...నా స్వదేశాన్ని నేనే ఇంతవరకూ చూడలేదు...లీమా అంతటా డ్రగ్స్, మాఫియా గ్యాంగ్ లు ఉంటారు జాగ్రత్త అమ్మాయిలూ అని హెచ్చరించాడు..ఇంక చూసుకోండి నాకు గుండె దడ మొదలు..అసలే ఇంట్లో చెపితే వెళ్ళద్దు అంటారు అని అమ్మ, నాన్న కు చెప్పకుండా, తమ్ముడికి, చెల్లాయి కి పేరెంట్స్ తో చెప్పకుండా ఉండడానికి లంచం ఇస్తానని మొదలుపెట్టిన జర్నీ కాబట్టీ ఒక పక్క ఆ పశ్చాత్తాపం, ఇదేంటి యితను యిలా భయపెడుతున్నాడు అని తల్చుకొని ఒక్క సారి ఏడుపు వచ్చేసింది..ఇలాంటప్పుడే మనకి కోటి దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు...అలా దేవుళ్ళ కి క్షేమము గా మళ్ళా ఇంటికి చేర్చమని వేడుకుంటూ, భాష రాని దేశం లో గైడ్ వద్దు మనమే చూద్దాము అని నొక్కి వక్కాణించి చెప్పిన(క్షమించాలి..ఎప్పుడో చిన్నప్పుడు దుర్గాబాయి దేశ్ఁముఖ్ గారి గురించి చదివిన పాఠము లో ఈ పద ప్రయోగము బాగ నచ్చేసి ఇలా నా రాత లలో పెట్టేసుకుంటున్నా) నా మూర్ఖత్వానికి నా లో నేనే తిట్టుకుంటూ మొత్తానికి లీమా విమానాశ్రయం లో దిగాను.(ఆ తరువాత ఏమి జరిగింది, మేము ముగ్గురము ఎలా కలుసుకున్నాము, ఎక్కడెక్కడ కి వెళ్ళాము మిగతా కధ మళ్ళీ ఎప్పుడో రాసేస్తా..ఇప్పటికి ఇంతే సంగతులు చిత్తగించవలెను)...మీ..వినీల.

10 comments:

sivaprasad said...

blog name chala bagundi

Vineela said...

sivaprasad ji..Thank you :)

ఇందు said...

భలే ఇంటరెస్టింగ్ గా ఉంది! నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్! ఎందుకంటే...నేను చూడాలనుకున్న ప్రదేశాల్లో పెరూ టాప్టెన్ లిస్ట్లో ఉంది ;) సో...మీ యాత్రని బట్టి నా యాత్రలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తానన్నమాట! :)

Vineela said...

@ఇందు గారు,
టపా నచ్చినందుకు ధన్యవాదాలు అ౦డీ, మీ బ్లాగ్ అప్పుడప్పుడు చదువుతుంటాను..భలే రాస్తారండి..నేను ఈ కొంచం రాయడానికే ౩ గంటలు పైన పట్టింది..అన్ని క్రియేటివ్ అవిడియాలు ఎలా వస్తాయండి అసలు బోలెడు బ్లాగ్ లు రాయడానికి :)) హహ nexxt పార్ట్ కోసం నా దోస్తులని అడిగా నేను ఎమన్నా మరచిన ఇన్సిడెంట్స్ చెప్పమని....ఇక మొదలెట్టి రాసేస్త..మీరు ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో చెప్పండి....నేను మా ట్రేవలోగు మొత్తం మీకు పంపుతాను :)

ఇందు said...

Hii Vineelaa Thnq :) Creativity aaa naamohama?? Edo interest anthe :P Yeah! may b thsi year ending! akkada summer lo temp high gaa untayata kadaa!! Naku chinnapudu social studies lo chadivetappudu..'peru' 'Chile' perlu vinthaga undevi ;) ika Machchu-Pichchu chusaka..flatt!! eppatinincho vellalani :) Meeru ilaa raastu undadi :) nenu dani prakaram plan chesta :)

హరే కృష్ణ said...

కెవ్వ్
భలే ఉన్నాయి మీ ప్రయాణ అనుభవాలు
Machu Picchu ఫొటోస్ మరిన్ని పెట్టగలరా మరో పోస్ట్ రాసే ఉద్దేశ్యం ఉంటే
just loved that place thanks to Robot movie too :))
ఎస్ చిన్నప్పుడు సోషల్ లో పేరూ చిలీ బ్రజిల్ ఇవ్వన్నీ వినడమే
చూసి కూడా వచ్చారంటే really amazing!

Vineela said...

హరే గారు..తప్పకుండా మిగతా ఫొటోస్ పెడతాను..మరో పొస్ట్ కూడా రాస్తాను..అప్పుడెప్పుడో మొదలెట్టి ఆపేశాను..నా బ్లాగ్ ఎవరు చదువుతారు లే అని అనుకున్న..ఇలా ప్రోత్సాహం ఇస్తే అల్లుకుపోతాను

రసజ్ఞ said...

అరే! మిగతా పార్ట్ ఏదండీ? పెరూ లో ఎక్కడికి ప్రయాణం చెయ్యాలన్నా రోలులో వెళ్తే ఆ మజానే వేరు. పచ్చని ప్రకృతి ఒడిలో వంపులతో పాటు పరుగెత్తే రైలు, ఆ ఆనందం ఆస్వాదించిన వారికే తెలుస్తుంది. ఒట్టి పెరూ నే వెళ్ళారా? లేక గలాపగోస్ కూడా వెళ్ళారా? త్వరగా చెప్పండి.

Vineela said...

హై రసజ్ఞ గారు, స్వాగతం అండీ నా బ్లాగు కి...నా కంప్యూటర్ కష్టాల తో విసుగెత్తి బ్లాగు కి దూరమయ్యా..ఈ వీకెండ్ మిగతా భాగం రస్తాను. అబ్బ నా బ్లాగు ఎవరు చూస్తారు లే అనుకునేదాన్ని. ఇక నుండి కాస్త రెగ్యులర్ అవుతాను. ఇక పోతే పెరు మేము 5 రొజులకే వెళ్ళాము..సో వేరే ఇంక ఎక్కడికీ వెళ్ళలేదు అండి...మీరు వెళ్ళార అయితే మీ విశేషాలు చెప్పండి వీలైతే

Pramodh said...

Hello Vineela garu,

I liked the blog of yours... really interesting..

I am planning on trip to Peru. Let me know if its worth it.

I was moved reading about your friend Raj. So sorry about him. RIP Raj. Really moved with that.

I think you are good writer too. I am not sure why you stopped writing blogs I think you should continue.

Regards,
Pramodh

Post a Comment